నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ ఆరోపించింది.
ఆత్మకూరు ఉపఎన్నికలో లక్ష మెజారిటీ కోసం లక్ష పాట్లు పడ్డారు వైసీపీ నేతలు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేశారు. బై ఎలక్షన్‌లో గెలిచినా లక్ష్యాన్ని చేరుకోకపోవడమే అధికారపార్టీ శిబిరంలో చర్చగా మారింది. ఆ అంశంపైనే పోస్టుమార్టం చేస్తున్నారట. పార్టీ నేతల అనైక్యత వల్లే లక్ష మెజారిటీ రాలేదా? ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ బరిలో లేకపోవడం.. బీజేపీ మాత్రమే బరిలో ఉండటంతో.. సులభంగా లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఆశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా…
ఆత్మకూరు అసెంబ్లీకి ఈ నెల 23న ఉపఎన్నిక జరగనుంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక జరిగిన రెండు ఉపఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు ఆత్మకూరు వంతు వచ్చింది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లో మేకపాటి గౌతంరెడ్డి వరసగా గెలిచారు. కాకపోతే 2014లో 31 వేల ఓట్ల మెజారిటీ వస్తే.. 2019లో 22 వేల ఓట్లకే అది పరిమితమైంది. గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందర్నీ శోక సంద్రంలో ముంచెత్తింది.. ఎంతో భవిష్యత్ ఉన్న నేత.. మరణాన్ని అటు కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక, ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి.. అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నా.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి,…
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూయడంతో.. ఆయన ప్రతినిథ్యం వచ్చింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు? మరోసారి గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతారా? లేదా గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన భార్య కీర్తి పోటీ చేస్తారా? ఆ ఫ్యామిలీ మళ్లీ కేబినెట్ పదవి దక్కుతుందా? అనే చర్చ జోరుగా సాగింది.. అయితే, ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి రెండో కుమారుడు,…