పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి తిరుగే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉండి, పాలకొల్లు తప్ప అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. సాక్షాత్తు వైసీపీ ఎంపీటీసీ చంపుతానని అదే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెదిరిస్తున్నాడంటూ, ప్రాణ రక్షణ కావాలని నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. https://ntvtelugu.com/pinnelli-ramakrishna-reddy-meets-cm-jagan/ ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లికి ఎంపీటీసీ బజారయ్యను శ్రీరామనవమి రోజున…
ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికార పార్టీని అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయం పార్టీని కుదిపేస్తోంది. అంతా బాగానే వుందని చెబుతున్నా.. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు నేతలు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బలు…
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో మొదటి ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కోరడంతో దానిపై వైసీపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే రెండవ రోజు ఉద్రిక్తతల నడుమ సాగిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం నిర్వహించనుంది.…
కేబినెట్‌లో చోటుకోసం ఎదురు చూస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేలను రెండున్నరేళ్ల గడువు ఊరిస్తోంది. జిల్లాల నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. రేస్‌లో వెనకబడకుండా.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శాసనసభ్యులు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అలాంటి వారిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా నుంచి కేబినెట్‌లో చోటుదక్కేది ఎవరికి? రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ఏర్పాటుకాగానే.. మొదటి జాబితాలోనే మంత్రి కావాలని ఆశించినవారు అనేక మంది. సీనియర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు సీరియస్‌గానే ప్రయత్నించారు.…