టమాటా ధర ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా మార్కెట్ కిలో టమాట రూపాయి, రూపాయి పావలా కూడా పలకని పరిస్థితి. 25 కిలోలు ఉన్న టమాటా బాక్సు 30 నుంచి 40 రూపాయలు లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. పోనీ పంట ఎక్కువగా వస్తుంది.. ధర తగ్గిందా అంటే.. అదీ లేదు. వ్యాపారులకు సరిపడా టమాటా సరుకు రావడం లేదు. రేపో మాపో మార్కెట్ కూడా మూసివేయాల్సి వస్తోంది. అయినా టమాటాకు ధర మాత్రం…
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో రోజురోజుకీ టమోటా ధర పెరుగుతోంది.. కిలో టమోటా రూ. 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది.. జత బాక్స్ 2000 నుండి 2500 పలుకుతుండడంతో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతుల ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.. ఇక, టమోటా ధర మంచి ధర పలుకుటుండడంతో అప్పుల బారి నుండి బయట పడుతున్నామని టమోటా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు నెలల క్రితం దేశ వ్యాప్తంగా మంట పుట్టించిన టమాటా.. ఇప్పుడు చవకై పోయింది. కిలో రూ.300కు పలికి చుక్కలు చూపించి.. ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో టమోటా రూ. 2 కూడా పలకడం లేదు.
మొన్నటి వరకు సామాన్యులను ఏడిపించిన టమాటా.. ఇప్పుడు రైతులను ఏడిపిస్తోంది. దాదాపు మూడు నెలల పాటు సాధారణ ప్రజలు వాటిని తినాలంటేనే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి.
గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేలకు దిగొచ్చాయి.
Tamota Prices: టమోటా ధర మరోసారి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో కేవలం రూపాయే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోలు చొప్పున ఉండే 15 గంపల టమోటాలకు పత్తికొండ మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తే కమీషన్ పోగా రైతులకు మిగిలింది కిలోకు కేవలం రూపాయి మాత్రమేనని వాపోతున్నారు.…
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.. దీంతో. లబోదిబోమంటున్నారు రైతులు. అధిక వర్షాల వల్ల టమోటా బాగా దెబ్బతినడంతో రైతులు బాగా నష్టపోతున్నారు.. ఉన్న కాస్త పంట కూడా చేతికి వచ్చి మార్కెట్ కి తీసుకెళ్తే.. కిలో 4 రూపాయలు కూడా ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మద్దికేర ఆస్పరి దేవనకొండ మండలాల నుండి టమోటాను మార్కెట్ కు తరలిస్తుంటారు రైతులు.. రెండు రోజుల నుండి…