Lucky Bhasker : రీసెంట్ గా వచ్చి భారీ హిట్ అయిన సినిమాల లిస్టులో లక్కీ భాస్కర్ కచ్చితంగా ఉంటుంది. మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చింది ఈ మూవీ. సామాన్యుడు గెలిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఈ మూవీ. దీనికి సీక్వెల్ రావాలంటూ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దానిపై క్లారిటీ ఇచ్చారు వెంకీ అట్లూరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అట్లూరి దీనిపై ప్రశ్న ఎదురవగా స్పందించారు. లక్కీ భాస్కర్ అనేది అరుదైన స్క్రిప్ట్. దాన్ని టచ్ చేయాలంటే చాలా లోతుగా స్టడీ చేయాల్సి ఉంటుందన్నారు.
Read Also : Ravi Kishan : పాలతో స్నానం చేస్తా.. గులాబీలపై పడుకుంటా.. రేసుగుర్రం విలన్ లైఫ్ స్టైల్
నేను లక్కీ భాస్కర్ మూవీ తీసినప్పుడే దానికి సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాను. కాకపోతే ప్రేక్షకుల ఆదరణను బట్టి అది డిసైడ్ చేయాలనుకున్నా. అనుకున్నట్టే లక్కీ భాస్కర్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేయాలనే డిమాండ్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. దానికి కొంచెం టైమ్ పడుతుంది కావచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు వెంకీ అట్లూరి. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లక్కీ భాస్కర్ భారీ హిట్ తో వంద కోట్ల మైలురాయిని అందుకుంది. వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తున్నాడు. దీన్ని భారీ బడ్జెట్ తో చేస్తున్నారు.
Read Also : Allu Arjun : తెలుగువారంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్ మాస్ స్పీచ్..