Off The Record: ఏబీ వెంకటేశ్వరరావు….. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సర్వీసులో ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వం మీద ఒక రకంగా ఆయన యుద్ధమే చేశారన్నది విస్తృతాభిప్రాయం. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరుడన్న ముద్ర కూడా గట్టిగానే ఉండేది. కానీ… ఇప్పుడాయన కూటమి సర్కార్ మీద కూడా అప్రకటిత యుద్ధం చేస్తున్నారా అన్నది కొత్త డౌట్. ఏబీవీ చర్యలు కూడా దాన్నే సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కూడా…
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై హాట్ కామెంట్లు చేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు.. పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టుగా పేర్కొన్నారు.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారు..
రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా ఒంగోలులో లాసెట్ ఎగ్జామ్‌కి హాజరయ్యారు.. ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10.30 గంటలకు వరకు జరిగిన లాసెట్ ఎగ్జామ్‌ను ఏబీ వెంకటేశ్వరరావు రాశారు.