కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. ర్యాగింగ్ పై విచారణకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ఆదేశించింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ చేత విచారణ జరిపించాలని ఎన్ ఎం సి ఆదేశించింది.
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. తరగతులు ప్రారంభమై వారం గడవక ముందే జూనియర్లకు ర్యాగింగ్ వేధింపులు మొదలయ్యాయి. మీసాలు, గడ్డాలు తీసేసుకోవాలని సీనియర్ల హుకుం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క
కర్నూలు మెడికల్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపులపై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది.