ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గొనెగండ్ల మండలంలోని బి.అగ్రహారంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే సాధ్యమని తెలిపారు.
ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి ఆశ్రమంలో పూజలు చేసి మండలంలో…
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేత మాచాని సోమనాథ్ పర్యటిస్తున్నారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలు తనకు నీరాజనం పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేస్తానని అన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉందని.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పర్యటిస్తున్న మీరే తమ ఎమ్మెల్యే అని ప్రజలే అంటున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే అవుతానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని.. పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి…