మధ్యప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల జరిగిన మూడో దశ పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
ఇవ్వాల్సిన డబ్బు కోసం ఇంటి మీదకు వచ్చి బెదిరిస్తారు.. తిడతారు.. కొడతారు. కానీ ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అప్పు తీర్చలేదని బాలుడిని కిడ్నాప్ చేశాడు ఆళ్లగడ్డ వైసీపీ కౌన్సిలర్ వరలక్ష్మి కుమారుడు సుధాకర్. తీసుకున్న అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌లో 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ హృదయ విదారకమైన సంఘటన బుధవారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి మాధవ్ గా గుర్తించారు. అయితే.. క్లాస్ మధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో…