Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.
Read Also: Cow Dung: ఆవు పేడతో కొట్టుకుంటే సరి..! పెళ్లి కాని వారికి కూడా పెళ్లి అవుతుంది..
ఈ ఘటనలో పూర్తిగా బస్సు దగ్ధమైంది.. అయితే, ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆందోళనకు గురి అవుతోన్న నేపథ్యంలో.. బాధితుల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
* కర్నూలు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305
* కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059
* ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061
* కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075
* కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010 ఏర్పాటు చేశారు.. అయితే, బాధిత కుటుంబాలుపై నంబర్లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు అని సూచించారు కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి
మరోవైపు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. హెల్ప్ లైన్ నెంబర్లు.. సంప్రదించాల్సిన అధికారులు: 9912919545 ఎం. రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ.. 9440854433 ఈ.చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్..