Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో.. వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఎప్పటికప్పుడూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
Andhra Pradesh: ఏపీలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు జిల్లాలలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలో మాండూస్ తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గిరీషా సూచించారు. జిల్లాలో సైక్లోన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని.. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సమస్యలపై కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్:…
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది… ఇవాళ అండమాన్ తీరంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. క్రమంగా వాయుగుండంగా మారుతోంది అల్పపీడనం… రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది… అనంతరం సిత్రాంగ్ తుఫాన్ గా బలపడనుంది వాయుగుండం… ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది… వాయుగుండంగా మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బలమైన గాలులు వీచేఅవకాశం ఉండగా.. అక్కడక్కడా ఓ మోస్తరు లేదా…