Vishnuvardhan Reddy: టీడీపీ 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదు.. కానీ, బీజేపీ, జనసేన పార్టీతో కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తుందని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతుందని పేర్కొన్నారు.. రాయలసీమకు సంబంధించిన చంద్రబాబు, వైఎస్ జగన్.. రాయలసీమను మోసం చేశారని విమర్శించారు.. మేం అధికారంలోకి వస్తే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.. అయితే, ఏపీలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు.. టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి వెనాకాడుతుందన్న ఆయన.. టీడీపీ.. వైసీపీని ఎదురుకొనే స్థాయి లో లేదు.. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు.
Read Also: Anil Kumar Yadav: పవన్, లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్ సవాల్.. ఆ ధైర్యం ఉందా.?
ఇక, వైసీపీ పట్టభద్రులను ప్రలోభాలకు గురిచేస్తుందని ఆరోపించారు విష్ణువర్ధన్‌రెడ్డి.. వైసీపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడడంలేదు.. చివరకు వార్తలు రాసిన జర్నలిస్టులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు.. హైకోర్టు చెప్పినా జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. సీఐపై ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు.. ఏపీ హోమ్ మంత్రి ఈ ఘటన పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయని వైసీపీ నేతలు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.. ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ఘటన సుమోటో గా తీసుకోరు అని ప్రశ్నించారు.. ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకొని వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారు అంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి.