Site icon NTV Telugu

Kurnool Crime: కర్నూలులో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో పురుగులమందు తాగించి..!

Kurnool Crime

Kurnool Crime

Kurnool Crime: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Read Also: IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్‌కు పంత్!

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల పోసి ప్రేమోన్మాది చిన్న వీరేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అశ్విని.. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ప్రేమించకపోతే చంపేస్తానని చిన్న వీరేశ్.. సదరు బాలికను బెదిరించారు. ఇక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.. ఆ బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుమందు తాగించాడు… అయితే, పెనుగులాటలో వీరేశ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక, పొలం పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చావు బతుకుల్లో కనిపించిన అశ్వినిని చూసి షాక్‌ తిన్నారు.. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రేమ పేరుతో తన కూతురు వేధింపులకు గురి చేసి.. అత్యాచార యత్నం చేసి ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు..

Exit mobile version