Pastor Cheating: ప్రజలకు దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని కొంతమంది తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇక మరికొంతమంది దేవుడు పేరు చెప్పుకొని పాడుపనులు చేస్తున్నారు. తాజాగా ఒక పాస్టర్ దేవుడు పేరుచెప్పి ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసిన ఘటన కృష్ణాజిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ళ నాగేశ్వర్ అనే వ్యక్తి నూజివీడు చర్చ్ పాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య క్యాన్సర్ తో మృతి చెందింది. ఈ నేపథ్యంలో అతడి కన్ను చర్చ్ కు వచ్చిన మైనర్ బాలికపై పడింది.
కొన్నిరోజుల క్రితం ఒక మైనర్ బాలిక ఆరోగ్యం బాలేదని పాస్టర్ వద్దకు వచ్చింది. ఆమెకు స్వస్థత చేకురుస్తానని మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి ప్రేమలో దించాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో ఆమెను వారి అమ్మ వారి ఇంటికి పంపించగా మూడురోజుల క్రితం బాలికను అక్కడినుంచి తీసుకువెళ్లిపోయాడు. ఇక బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. బాలికను ఇంట్లో అప్పగించి పాస్టర్ ను జైలకు తరలించారు.