Mandava Janakiramayya Passes Away: విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ మండవ జానకిరామయ్య కన్నుమూశారు.. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జానకిరామయ్య, గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలం పాటు విజయ డెయిరీ చైర్మన్‌గా అంటే ఏకంగా 27 సంవత్సరాలు సేవలందించిన ఆయన, రాష్ట్రంలోని పాడి రైతుల సంక్షేమం కోసం నిరవధికంగా కృషి చేశారు. తన స్వగ్రామం మొవ్వలో విద్యా అభివృద్ధికి విశేష సేవలు అందించిన జానకిరామయ్య, కళాశాలలు, పాఠశాలల నిర్మాణానికి తన సొంత నిధులు వెచ్చించి గ్రామ అభివృద్ధిలో ముద్ర వేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం మొవ్వ గ్రామంలో నిర్వహించనున్నారు. జానకిరామయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం పాడి రంగానికి తీరని నష్టమని.. ఆ నష్టాన్ని పూడ్చలేమంటున్నారు రైతులు.. కాగా, జానకిరామయ్య మృతుకి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు..
Read Also: Adivi Sesh: ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారు – అడివి శేష్ ఫైర్ కామెంట్స్