Adivi Sesh: ప్రేక్షకులే విజేతను నిర్ణయిస్తారు – అడివి శేష్ ఫైర్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు అడివి శేష్ ఎప్పుడూ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మార్చి 19న ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ కూడా విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో “బాక్సాఫీస్ వార్ రాబోతోంది” అంటూ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అడివి శేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Akhanda 2 : “అఖండ 2 తాండవం” సాంగ్ డేట్ ఫిక్స్! థమన్ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్
Also Read
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
“బాక్సాఫీస్ వార్ అనేది పూర్తిగా మీడియా సృష్టించిన పదం. ప్రేక్షకులే ఎప్పుడూ విజేతను నిర్ణయిస్తారు. వారే చివరగా జడ్జ్ చేస్తారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవడం కొత్త విషయం కాదు. ‘లగాన్’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ ఒకేసారి వచ్చి రెండూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. అలాగే 2018లో ‘కేజీఎఫ్’ మరియు షారుక్ ‘జీరో’ కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడు గుర్తిస్తారు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు,” అని శేష్ స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఆయన తన సినిమాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ “‘టాక్సిక్’ సినిమాకు మేం ఏ మాత్రం భయపడటం లేదు. నేను ఎప్పుడూ సైలెంట్‌గా వచ్చి హిట్‌ను సొంతం చేసుకుంటాను. నా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా సంతోషపడతారని నాకు నమ్మకం ఉంది. కథే హిట్ అవుతుంది, స్టార్ కాదు. మా టీమ్ చేసిన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా” అన్నారు. శేష్ మాటల్లో స్పష్టంగా కనిపించింది ఆయన విశ్వాసం కథపై, ప్రేక్షకుల అభిరుచిపై ఉందని. వాణిజ్యపరంగా ఎంత పెద్ద సినిమాలు వచ్చినా, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడూ గెలుస్తుందనే నమ్మకం ఆయనలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ‘డెకాయిట్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజావార్తలు
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!