కృష్ణాజిల్లా గుడివాడలో మరోసారి ప్రత్యక్షమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఈ మధ్యే గుడివాడలో కనిపించిన ఆయన.. ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.. ముందస్తు బెయిల్‌లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని..
సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరయ్యారు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని.. అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.. ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు ఇవాళ గుడివాడ కోర్టుకు…
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిపై మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. కొడాలి నానిపై గుడివాడలో 2, విశాఖపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయ్యాయి. ఇవి కాకుండా మైనింగ్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేయటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడారు. నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని.. ఇంత మంచి చేసినా ఓటమి పాలవడం నమ్మశక్యంగా లేదన్నారు.