గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది.. ఇప్పటికే పలు కేసులు ఆయనపై నమోదు కాగా, తాజాగా మరో మూడు కేసులు పెట్టారు పోలీసులు.. వల్లభనేని వంశీ పై మూడు కేసలు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు.. ఆత్మకూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్‌లతో పాటు మళ్లీ గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి..
వల్లభనేనిపై మరో ఫిర్యాదు అందింది.. కోనాయి చెరువు రిజర్వాయర్ కు అదనంగా మరో రిజర్వాయర్ నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. తొండెం గట్టు చెరువులో మట్టి తవ్వకాలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు వంశీ, ఆయన అనుచరులపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీ అనే వ్యక్తి.. దీంతో, వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు..