ఏపీలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మద్దతు ఇచ్చారు. రైతులు ఇప్పటికే జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. పాలన అంత అమరావతి నుంచే జరగాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే అమరావతి రైతులు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వారు పాదయాత్రను చేపట్టారు. విజయవాడకు వచ్చిన కోదండరాంను అమరావతి రైతులు కలిసి పాదయాత్రలో పాల్గొనాలని కోరారు.
దీనిపై స్పందించిన కోదండరాం మాట్లాడుతూ… రైతుల ప్రమేయం లేకుండా అమరావతిపై నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. అమరావతి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తనకు వీలున్నప్పుడు పాదయాత్రలో పాల్గొంటానని కోదండరాం చెప్పారు. కాగా రైతులను ఇబ్బందులకు గురి చేయోద్దని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.