Karumuri Nageswara Rao Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు చెప్పే వ్యక్తి అని.. ఆయన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓ ముసలి నక్క అని ధ్వజమెత్తిన ఆయన.. ఇటీవలే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఓ టిష్యూ పేపర్ లాంటిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంతంగా ఏనాడు అధికారంలోకి రాలేదని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని ఆరోపించారు. అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వమే ముందుందని.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
Gujarat : పోర్న్ సైట్లు, న్యూడ్ ఫోటోలు.. ఇలాంటి పార్టనర్ వద్దని పోలీసుల చెంతకు చేరిన భార్య
కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాగులు, జొన్నలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి కారుమూరి వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్‌లో కూడా గోధుమ పిండి కొనుగోలు మొదలు పెట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో మాత్రమే గత ప్రభుత్వం ఐదేళ్లలో రెడ్ కందిపప్పు (దాల్)కు రూ.487 కోట్లు ఖర్చు చేస్తే.. తమ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లకు 2 లక్షల 99 మెట్రిక్ టన్నులకు గాను ఒక వెయ్యి 73 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రబీ సీజన్‌లో రైతులకు 2763 కోట్లకు గాను 19.55 కోట్లు చెల్లించామన్నారు. ఇంకా చెల్లించాల్సింది రూ.800కొట్లేనని, అది కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. కేరళ రాష్ట్రం తమకు రైస్ కావాలని అడుగుతోందని, ఎంత రైస్ అయిన కొనడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తోందని చెప్పుకొచ్చారు.
Newly Married Couple: శోభనానికి గదిలోకెళ్లారు.. తెల్లారేసరికి శవాలుగా తేలారు
కాగా.. అంతకుముందు కూడా టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అలవికాని హామీలతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, టిష్యూ పేపర్ కన్నా హీనమైన ఆ మేనిఫెస్టోలోని హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని, ఎవరెన్ని అమలు చేశారో చూద్దామని సవాల్ విసిరారు. బాబుకు పదవీ కాంక్ష, రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన వదలడం లేదని.. చంద్రబాబు ముఖంలో రాజకీయంగా ప్రేతకళ కనిపిస్తుందని ఫైర్ అయ్యారు.