Deputy CM Pawan Kalyan: సొంత నియోజకవర్గం పిఠాపురంలో రెండు రోజుల పర్యటనకు వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు.. పిఠాపురంలో కాలనీలలో నడుచుకుంటూ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాకపోవడంపై అధికారులను వివరణ అడిగారు.. నియోజకవర్గంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు.. పిఠాపురం కమిషనర్ కనకారావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితిలు ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను గుడ్ మార్నింగ్ పిఠాపురం అంటూ తిరిగి సమస్యలను పరిష్కరించాలా..? అని అడిగారు.. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో జనాలు ఎలా ఉంటారని ఎవరు ఆగ్రహం వ్యక్తం చేశారు.. కనీస సదుపాయాలు కూడా లేకపోతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎందుకని సీరియస్ అయ్యారు.. డెవలప్‌మెంట్ అథారిటీగా ప్రకటించి ఉపయోగమేముందని అడిగారు పవన్..
Read Also: Rain Forecast for Andhra Pradesh: బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు..!
ఇక, పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారని ఒక కౌన్సిలర్ ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు.. మీరు ఉండి ఏం చేస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదని అడిగారు.. గతంలో కూడా ఇలా అడిగి ఉంటే సమస్య ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదని తెలిపారు.. ఒక టైం పీరియడ్ పెట్టుకొని సమస్యలు మొత్తం సాల్వ్ చేయాలని ఆదేశించారు..
అయితే, గతానికి భిన్నంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన సాగింది.. నియోజకవర్గంలో సమస్యలపై అధ్యయనం చేశారు.. క్షేత్రస్థాయిలో తన దృష్టికి వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.. దానికి అనుగుణంగా గ్రౌండ్ లెవల్‌లో పరిశీలించారు.. పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలకు సంబంధించిన అభివృద్ధి పై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించారు… నియోజకవర్గానికి సంబంధించిన అధికారులతో రివ్యూ నిర్వహించారు. అధికారులు సీరియస్ గా లేరని పద్ధతి మార్చుకోవాలని సూచించారు. తాను వచ్చినప్పుడు ఇంతమంది అర్జీలు ఎందుకు తీసుకువస్తారని, వారి ఇబ్బందులు అధికారుల స్థాయిలోని తీరాలి కదా అని అడిగారు.. అవసరమైతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోవాలని కూటమి నేతలను ఆదేశించారు.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం పట్ల కమిట్‌మెంట్‌తో పని చేయాలని కోరారు…
ప్రతిపక్ష పార్టీకి చెందిన లోకల్ ప్రజా ప్రతినిధులు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జనసేన నేతలు చెప్పే ప్రయత్నం చేశారు.. అలాంటప్పుడు కూటమి నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్.. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.. తనకు అవకాశం ఉన్నంత మేర పిఠాపురం అభివృద్ధికి అన్ని చేస్తానని అన్నారు పవన్.. మొత్తానికి పిఠాపురం పవన్ టూర్ గతానికంటే డిఫరెంట్ గా జరిగింది, నియోజకవర్గంలో తాను ఉండడం లేదనే విమర్శలకు కౌంటర్ ఇస్తూనే క్షేత్రస్థాయిలో సమస్యలపై ఫోకస్ చేశారు.. దానికి అనుకూలంగా వాటిని సాల్వ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.. సీరియస్ నెస్ ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉండవని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..