Rain Forecast for Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలు చలి పంజాతో గజగజ వణికిపోతున్నాయి.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: Tirumala Laddu Ghee Adulteration Case: లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సంచలనం
వాయుగుండం ప్రభావంతో.. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, రాయలసీమ ప్రాంతంలోని ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ తీవ్ర వాయుగుండం రేపు అనగా జనవరి 10వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంకలోని ట్రింకోమలీ – జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని APSDMA తెలిపింది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఏపీపై కొనసాగి, రెండు రోజుల పాటు వర్షాలు పడే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు.