పైరసీ భూతం టాలీవుడ్ ను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. గతంలో సినిమా రిలీజ్ రోజు ఎక్కడో మారుమూల ఓ సెంటర్ లో సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసీ థియేటర్ ప్రింట్ ను రిలీజ్ చేసి సొమ్ము చేసుకొనేవారు. అర్జున్, అత్తారింటికి దారేది లాంటి మరికొన్ని సినిమాలయితే థియేటర్ కంటే ముందుగా కూడా పైరసీ రూపంలో బయటకు వచ్చేసాయి. ఎన్ని చర్యలు తీసుకున్న సరే పైరసీకి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇప్పడు సినిమా స్థాయి పెరగడం, పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో పైరసీ ముఠా కూడా అడ్వాన్స్ గా మారింది.
Also Read : HariHaraVeeraMallu : ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ ట్రీట్.. ఒకటి కాదు ఏకంగా మూడు
పాన్ ఇండియా మోజులో సినిమాలు ఎక్కడెక్కడో రిలీజ్ అవుతున్నాయి. అది పైరసీ కేటుగాళ్లకి వరంగా మారింది. ఓ థియేటర్ ను సెలెక్ట్ చేసుకుని ఏకంగా ప్రొజెక్టర్ రూమ్ లో కూర్చుని పైరసీ చేస్తున్నారు. ఇలాంటి ఉదంతం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కాంబోలో వచ్చిన చిత్రం కుబేర. జూన్ 20న థియేటర్స్ లో విడుదలైన కుబేర సినిమాను పైరసీ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసారు. హైదరాబాద్ లోని వీఆర్ సెంట్రల్ మాల్ లోని స్క్రీన్ 5లో రికార్డ్ చేసినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. పైరసీ మూలాలను గుర్తించేందుకు యాంటీ వీడియో పైరసీ సెల్ దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగింది. క్యూబ్ డిజిటల్ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ ద్వారా పైరసీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న వాటర్‌మార్కింగ్ ఉన్న పైరసీ వీడియోలు రికార్డ్ చేస్తూ కొత్త సినిమాలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు నేరగాళ్లు.