కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమిలో అగ్గి అంటుకోవడమే కాదు.... అది భగభగ మండే స్థాయికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళడమేకాకుండా... వీధి పోరాటాలకు సిద్ధమవడం కలకలం రేపుతోంది.
రేషన్ బియ్యం పంపిణీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లీగల్‌గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు.. వారికి మనమే అవకాశం ఇస్తున్నాం.. విజిలెన్స్ విచారణ, కేసులు వలన ఏంటి ఉపయోగం? అని నిలదీశారు..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంఘటన దురదృష్టకరమైన.. దైవ సన్నిధిలో ప్రాణాలను కోల్పోవడం అదృష్టమన్నారు నెహ్రూ. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెల్లించే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి.
అభివృద్ధి, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ�