Minister Nadendla Manohar: అందుకే పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ..
- జనసేన ఆవిర్భావ వేడుకలపై మంత్రి మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి ఇక్కడ ఆవిర్భావ సభ..
- రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు..
- జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ సభ ఉద్దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: జనసేన ఆవిర్భావదినోత్సవానికి సిద్ధం అవుతోంది.. ఈ సందర్భంగా పిఠాపురం వేదికగా ఈ సారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. అయితే, పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు.. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు కాకినాడలో కంట్రోల్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా నడుపుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం అని వెల్లడించారు.
Read Also: Hyderabad: పెళ్లయిన నెల రోజులకే.. నవవధువు ఆత్మహత్య
Also Read
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
- Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
మరోవైపు.. వైఎస్ వివేకానంద హత్య లో సాక్షులుగా ఉన్న ఆరుగురు విచిత్రంగా చనిపోయారు అంటూ జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్ చేశారు.. ఆ హత్యలు, మరణాలు వెనుక ఎవరు ఉన్నారో తెలియాలి.. సాక్షులు ను తొలగిస్తున్నారు.. కుటుంబ సభ్యులును కూడా బతకనివ్వడం లేదు.. చనిపోయిన వాళ్లు వృద్ధులు కాదు, ఆరోగ్య సమస్యలు లేవు అని ఆరోపించారు.. ఇక, జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకి ఏర్పాటు చేసిన కమిటీలతో రేపు కాకినాడలో సమావేశం నిర్వహించనున్నారు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలిసారి పిఠాపురం వేదికగా నిర్వహిస్తోన్న జనసేన ఆవిర్భావోత్సాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన పార్టీ..
తాజావార్తలు
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్‌లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
-
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
-
ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు ‘అన్ కలెక్టబుల్’గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!