Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలు, యువత పాటించాల్సిన బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు రంగాల్లో ముందుకు సాగుతోందని తెలిపారు. అడవితల్లి బాట కార్యక్రమం కింద గిరిజన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి
పులివెందుల, డోన్ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతులకు సాగునీటి సౌకర్యం అందించడంతో పాటు రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇక, రాష్ట్రంలోని అటవీ సంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్నామని, అలాగే అటవీ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను నిరోధించి, ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Also Read
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
- Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
అమరావతి, పోలవరంపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని ఆయన అన్నారు.
రూ.1,000 కోట్లతో పిఠాపురం అభివృద్ధి
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రూ.1,000 కోట్లతో పిఠాపురం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి ఉపయోగించవద్దని అన్నారు. సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని సూచించారు. ఏ విషయాన్నైనా వెంటనే నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పారు. వ్యవస్థలో ఏదైనా తప్పు కనిపిస్తే దానిని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి కానీ వ్యవస్థనే ధ్వంసం చేయకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ప్రజా ఆస్తులను ఎప్పుడూ ధ్వంసం చేయలేదని గుర్తుచేశారు. ఏదైనా విషయాన్ని నమ్మే ముందు ఆలోచించాలని, నిర్ణయం తీసుకునే ముందు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. స్వాతంత్ర్యం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని, ఆ స్వేచ్ఛను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!