Pawan Kalyan: జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..
- జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
- 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ.. పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం..
- 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీ.. ఇరిగేషన్.. అటవీశాఖ అధికారులతో సమీక్ష..
- 2న సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్న పవన్..
- 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రెడి అయ్యారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. జులై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ప్రకటించారు. తొలి రోజు గొల్లప్రోలులో పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, జూలై 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read Also: Nadendla Manohar: పౌర సరఫరాల శాఖలో లోపాలు ఉన్నాయి.. సరిదిద్దుతాం..!
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
అలాగే, జులై 2వ తేదీన సాయంత్రం జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇక, జులై 3న ఉదయం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే, ఇవాళ ( శనివారం ) పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి.. మొక్కులను చెల్లించుకున్నారు. కాగా, కొండగట్టుకు వెళ్తుండగా తెలంగాణలోని బీజేపీ- జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు