Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోలు చాలా మంది ఉన్నా, నాని ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం ఈ నేచురల్ స్టార్‌కు ప్లస్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ను ఓవర్ యాక్షన్ మూవీస్ చెడగొట్టాయి. వరుస సినిమాల్లో రక్తపాతంతో విసిగిపోయిన నాని ఇక్కడి నుంచి బుద్ధిగా ఫ్యామిలీ హీరోలా ఉండాలనుకుంటున్నాడు. నాని సినిమా యావరేజ్‌గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేశారు. కానీ హీరో యూటర్న్ తీసుకొని మాస్ ఇమేజ్ కోరుకున్నాడు. మాస్‌ను మెప్పిస్తేనే స్టార్డమ్ వస్తుందన్న నమ్మకంతో భారీ యాక్షన్ మూవీస్ చేయడం మొదలుపెట్టాడు. దసరా సక్సెస్ కావడంతో ‘హిట్ 3’, ‘ది పారడైజ్’ అంటూ రక్తపాతం సృష్టించాడు. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో ఇలా మితిమీరిన వైలెన్స్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చలేదు. ‘పారడైజ్’ ఫ్లాప్‌తో నానికున్న క్రేజ్ మసకబారింది. దీంతో కొంతకాలం వీటికి గుడ్‌బై చెప్పి ఫ్యామిలీ మూవీస్ తీసే డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలిసింది.
‘పారడైజ్’ ఓజీ రిలీజ్‌కి ముందే నాని సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కూడా నరుక్కోవడమే మెయిన్ అజెండాగా ఉంటుందో లేదోగానీ, ఆ తర్వాత నాని నటించే సినిమాలన్నీ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ మూవీసే. తమిళంలో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ ఎమోషనల్ కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. విజయ్ సేతుపతి, త్రిషతో తీసిన ’96’, కార్తీ, అరవింద్ స్వామితో ‘సత్యం సుందరం’తో ఆడియన్స్ మనసును హత్తుకున్నాడు ప్రేమ్ కుమార్. ఈ లెక్కన నాని కోసం ఈయన ఎలాంటి భావోద్వేగాన్ని సృష్టిస్తాడో చూడాలి మరి. ‘ఇరుముడి’ వంటి బ్లాక్‌బస్టర్స్ తీసిన శివ నిర్వాణ నానితో తీసిన ‘నిన్ను కోరి’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘టక్ జగదీష్’ ఫ్లాప్ అయింది. ‘ఇరుముడి’ హిట్ తర్వాత నాని – శివ కాంబోలో సినిమా వార్తల్లో నిలిచింది. శివ నిర్వాణ సినిమా అంటే కథ ఫ్యామిలీ చుట్టూ తిరగడం ఖాయం. నాని లైనప్ చూస్తుంటే నాని యాక్షన్ నుంచి మళ్ళీ ఫ్యామిలీ వైపు యూటర్న్ తీసుకున్నాడనిపిస్తుంది.
Also Read
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు