Kakani Govardhan Reddy: మంత్రిగా తొలి సంతకం ఏ ఫైలుపై పెట్టారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి సచివాలయంలో నూతన వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా 3500 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించామని తెలిపారు. సీఎం జగన్ రైతుపక్షపాతి అని పేర్కొన్నారు.
రూ. 20 వేల కోట్లకు పైగా రైతు భరోసా కింద ఇప్పటివరకు నగదు బదిలీ చేసినట్లు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. గన్నవరం స్టేట్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించామని.. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేశామని తెలిపారు. రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
మరోవైపు సచివాలయంలో గిరిజన శాఖ మంత్రిగా రాజన్నదొర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గిరిజన సహకార సంస్థకు సంబంధించి కారుణ్య నియామకాల ఫైలుపై తొలి సంతకం చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశీయ కోళ్లు పెంపకానికి సంబంధించిన ఫైలుపైనా సంతకం చేసినట్లు వివరించారు. ఒక గిరిజనుడికి సీఎం జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని కొనియాడారు. గిరిజన శాఖా పరంగా ప్రమోషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని.. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై సీఎం ఆలోచిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొండలు ఎక్కడానికి రోడ్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మానవ హక్కుల సంఘం తన నియోజకవర్గంలో ఒక గర్భిణీ రోడ్డుపై ప్రసవమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకుందన్నారు. ఈ మేరకు కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం జగన్ అనుమతులిచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది గిరిజనులు ఉన్నారని.. 50 మండలాలలో గిరిజన జనాభా విస్తరించిందని మంత్రి రాజన్న దొర పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర నిధులను రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!