Cybercrime : మత్యశాఖ జేడీకి సీబీఐ కాల్.. 7.6 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఆంధ్ర రాష్ట్ర మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ కి గురైయ్యారు. ఈ క్రైమ్ లో ఆయన లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గత నెల 27 వ తేదీన వి.వెంకటేశ్వరరావు పెనమలూరు కూడలి లోని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్తున్న తరుణంలో ఆయనకి ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) పేరుతో ఓ ఫోన్ వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా.. అవతలి వాళ్ళు చెప్పిన విషయం విని విస్తుత పోయారు. కొంత కాలం క్రితం ముంబయిలో మీ ఆధార్ నంబరుతో వి.వెంకటేశ్వరరావు పేరు పైన ఓ సిమ్ కార్డు కొన్నారని.. అలానే ఆ సిం కార్డు నుండి ఓ మహిళలకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు వెళుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇది విన్న వి.వెంకటేశ్వరరావు నిర్ఘాంత పోయారు.
Read also:Telangana Elections 2023: ప్రచారంలో కౌశిక్‌రెడ్డి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్.. విచారణకు ఈసీ ఆదేశం!
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
అతనికి ఆలోచించుకునే సమయం కూడా వాళ్ళు ఇవ్వ లేదు. వెంటనే ఫోన్ మాట్లాడుతున్న ఆ వ్యక్తి వెంకటేశ్వరరావు తో నౌపడా పోలీస్ స్టేషన్ ఎస్సైతో మాట్లాడాలంటూ కాన్ఫరెన్స్ కలిపాడు. కాన్ఫరెన్స్ లో మరో వ్యక్తి తన పేరు సందీప్‌రావు అని, తాను నౌపడా స్టేషన్ ఎస్సైని అంటూ.. మీ మీద దాదాపు 17 మంది మహిళలు ఫిర్యాదు చేసారని చెప్పాడు. దీనితో వెంకటేశ్వరరావు మరింత భయపడ్డారు. ఏం జరుగుతుందో అర్ధంకాని వెంకటేశ్వరరావు తాను ఏపీ మత్స శాఖలో జాయింట్ డైరెక్టర్‌నని తెలిపి.. నా 60 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు ముంబయి వచ్చిందే లేదని.. అలాంటప్పుడు నేను ఎలా సిమ్ కార్డు కొని మహిళలకు అసభ్యకర సందేశాలు, ఫోన్లు ఎలా చేయగలను అని ప్రశించారు. అయితే ఎస్సై సందీప్‌రావు అంటూ మాట్లాడిన ఆ వ్యక్తి వెంకటేశ్వరరావు మాటలను పట్టించుకోలేదు. అంతేకాదు ఒకసారి సీబీఐ అధికారి మీతో మాట్లాడతారంటూ మరో వ్యక్తిని రంగంలోకి దించాడు. అతను తన పేరు ఆకాష్ కులహరి అని.. తాను సీబీఐ అధికారినంటూ ఫోన్‌లో స్కైప్ యాప్ ద్వారా పోలీస్ యూనిఫాంతో వీడియో కాల్ లో మాట్లాడాడు.
Read also:Tollywood: ఇస్మార్ట్ శంకర్-మాస్ కా దాస్ మధ్య బాక్సాఫీస్ ఫైట్…
ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు హడలిపోయారు. కాగా సీబీఐ అధికారినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి ఈ కేసు విషయంలో కొంత నగదు డిపాజిట్ చేయాలని, కేసు పూర్తయిన తర్వాత తిరిగి తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా వాళ్ళు చెప్పిన ఖాతాలో రూ.7.60 లక్షలు డిపాజిట్ చేయాలని, నేషనల్ సీక్రెట్ లా మేరకు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చేయెప్పకూడదని.. చివరికి కుటుంబసభ్యులకు కూడా చెప్పకూడదని హెచ్చరించారు. అప్పటికే బెంబేలిత్తి పోతున్న వెంకటేశ్వరరావు సరేనని తన దగ్గర ఉన్న డబ్బులతో పాటుగా మరి కొంత అప్పు చేసి వాళ్ళు చెప్పిన ఖాతాలో వేశారు. డబ్బులు ఖాతాలో వేసినప్పటి నుండి తనకు కాల్ చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ కాల్ చెయ్యలేదు. ఆయన కాల్ చేసిన ఎవరు అందుబాటులో కి రాలేదు. ఈ క్రమంలో తాను మోసపోయినట్లు గ్రహించిన వెంకటేశ్వరరావు.. సోమవారం జిల్లా ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో కేసు నమోదు చేయాల్సిందిగా జాషువా పెనమలూరు పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!