మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో కంప్లీట్ గా తన లుక్ మార్చి కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్, గోదావరి యాసలో డైలాగులు చెప్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది అనుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడింది. ఈ డిసెంబర్ నుంచి 2024 మార్చ్ 8కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడింది. రిలీజ్ డిలే వెనక కారణాలు తెలియదు కానీ ఈ విషయంలో విశ్వక్ సేన్ కాస్త అప్సెట్ అయ్యి ఉంటాడు. డిసెంబర్ లో సినిమాని విడుదల చెయ్యాల్సిందే అని విశ్వక్ పట్టుబట్టి కూర్చున్నాడు కానీ అది జరగలేదు. ఇదిలా ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి ఇప్పుడు సాలిడ్ కాంపిటీషన్ ఎదురయ్యింది.
2024 మార్చ్ 8నే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “డబుల్ ఇస్మార్ట్ శంకర్” సినిమా తెరకెక్కుతుంది. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అనౌన్స్ అయిన రోజునే రిలీజ్ డేట్ చెప్పేసాడు పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు సంజయ్ దత్ కూడా కలిసాడు కాబట్టి ఇస్మార్ట్ కన్నా డబుల్ ఇస్మార్ట్ మరింత గ్రాండ్ గా ఉందనడంలో సందేహం లేదు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చ్ 8న రిలీజ్ అవుతుండడంతో డబుల్ ఇస్మార్ట్ తో క్లాష్ తప్పట్లేదు. తెలంగాణ యాసలో రామ్… గోదావరిలో యాసలో విశ్వక్ సేన్… ఈ ఫైట్ ఏ వెరైటీగా ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారు అనేది చూడాలి.