మరోరెండు రోజులు ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ర్టాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జవాద్ తుపాన్ బలహీన దక్షిణా కోస్తాలో మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో పెద్దగా మార్పులేమి ఉండవు. ఇటీవల వర్షాలకు అతలాకుతలమైన రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ వాతావరణం పొడిగా ఉంటుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగాపెరుగుతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లాల వద్ద అనే విషయంపై వాతావరణ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.