మరోరెండు రోజులు ఏపీలో వర్షాలుబంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో…
అండమాన్‌లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు జవాద్ తుఫాన్‌గా అధికారులు నామకరణం చేశారు. దీంతో ఈ జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర, ఒడిషా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా తుఫాన్ తీవ్రత తగ్గేవరకు విశాఖపట్నంలోని పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు, సందర్శకులు రావద్దంటూ ప్రకటించింది. అయితే ఇటీవల జవాద్ తుఫాన్ విశాఖపట్నంకు…
జవాద్ తుఫాన్ బీభత్సం కలిగించింది. జవాద్ తుఫాన్ ముప్పు తప్పిందని అనుకోవడానికి వీలు లేకుండా మరో ముప్పు వచ్చిపడింది. విశాఖ ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి బీటలు వారింది. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోవడంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. చిల్ట్రన్ పార్క్‌లో అడుగుమేర భూమి కుంగిపోయింది. పార్క్‌లోని బల్లలు ఒక పక్కకు ఒరిగిపోగా, ప్రహరీగోడ కూలిపోయింది.…
ఆంధ్రప్రదేశ్‌కు…జొవాద్ తుపాను ముప్పు తప్పింది. కోస్తాంధ్ర తీరానికి దగ్గర వచ్చినట్లే వచ్చి…దిశ మార్చుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. జొవాద్ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయ్. మరోవైపు తుపాను ప్రభావంతో…దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం…
అండమాన్ లో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారింది. అయితే ఈ తుఫాన్ పేరు జవాద్ తుఫాన్‌గా నామకరణం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఒడిశాలపై ఈ జవాద్ తుఫాన్ ప్రభావం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు…
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపానును ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలకు ఆదేశించింది. తుఫాను శనివారం ఉదయం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఏపీ, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.సముద్రంలో…
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం జవాద్తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. జవాద్ తుఫాన్ ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్లు, పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. అనంతరం తీరాన్ని ఆనుకుని కదులుతూ…
ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా,…
బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని… ఇది డిసెంబర్ 4న వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్‌కు అధికారులు జవాద్ అని నామకరణం చేశారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. జవాద్ తుఫాన్ ప్రభావంతో…
ఉత్తరాంధ్ర, ఒడిషాల వైపు జవాద్ తీవ్ర తుఫాన్ ముప్పు ముంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు అర్ధరాత్రి వాయుగుండం ఏర్పడనుంది. ఆ తర్వాత 24గంటల్లో తుఫాన్ గాను అనంతరం తీవ్ర తుఫాన్ గాను మారుతుంది. ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులతో ప్రయాణిస్తుంది. దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలు 3రోజుల…