మరోరెండు రోజులు ఏపీలో వర్షాలుబంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో…
జవాద్ తుఫాన్ ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు తప్పినట్టుగానే అంచనా వేస్తున్నారు అధికారులు.. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న జవాద్ తుఫాన్.. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బలహీనపడుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.. దీంతో ఉత్తరాంధ్రకు “జవాద్” తుఫాన్ ముప్పు తప్పినట్టేనని.. ఉత్తరాంధ్ర తీరానికి సమీపించి క్రమేపీ బలహీనపడుతూ ఒడిశా వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.. Read Also: మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం.. సంప్రదింపులతోనే సమస్యలకు పరిష్కారం.. ఇక, జవాద్ తుఫాన్…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కురిసిన వర్షాల ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు.. అప్పుడే మరో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది… ‘జవాద్’గా నామకరణం చేసిన ఈ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు ఏర్పాటు చేయాలని సూచించిన ఏపీ సీఎం..…