జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైజాగ్‌లో అరెస్ట్‌లు.. అరెస్ట్ అయినవారిని విడిపించేవరకు ఇక్కడే ఉంటానంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు.. ముద్దాయిలుగా ఉన్నవారిని, నేరచరిత్ర కలిగిన వారిని బయటికొస్తేనే పిటిషన్ తీసుకుంటానంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.. మీరు రాజకీయం చేస్తున్నారా.. ఫ్యాక్షన్ ముఠాలు నడుపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు.. ఇక, విజయవాడలో ఒక సభ…
ఉత్తరాంధ్ర గర్జన నేపథ్యంలో మంత్రులపై జరిగిన దాడి ఘటనలో అరెస్ట్‌అయినవారిని స్టేషన్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 13 మంది మినహా మిగతా అందిరికీ స్టేషన్ బెయిల్ వచ్చిందన్నారు.. ఇక, తన విశాఖ పర్యటనలో ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని.. ఇలాంటి ఆంక్షలు మళ్లీ విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించేలా పోరాటం చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.. ఇది ప్రభుత్వంపై పోరాటమే తప్ప.. పోలీసులపై…