అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా తీసుకు వెళ్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృతం చేస్తున్నాం అన్నారు.. క్యాన్సర్ మహమ్మారిగా తయారైంది.. ఐసీఎంఆర్ లెక్కలు ప్రకారం దేశంలో 8.74 లక్షలు మంది, మన రాష్ట్రంలో 42 వేల మంది క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సత్యకుమార్..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజవర్గం మినీ మహానాడులో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అర చెయ్యే ఆయుధం అవుతుందన్నారు.. సమయం మించి పోలేదు.. ఇంకా నాలుగేళ్ల సమయం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ధర్మవరం నాకు చాలా ఓపిక నేర్పించిందన్న ఆయన.. కానీ, నాలో ఉన్న ఒరిజనల్ అలానే ఉందన్నారు.. పొద్దు మునగాలంటేనే సమయం పడుతుంది.. ఎందుకు…
విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నాను. ఎపీఎంసీ సభ్యులుగా డాక్టర్ గోగినేని సుజాత, డాక్టర్ కె.వి.సుబ్బానాయుడు, డాక్టర్ డి.శ్రీహరిబాబు, డాక్టర్ స్వర్ణగీత, ఎస్.కేశవరావు బాబు, డాక్టర్ సి.మల్లీశ్వరి ప్రమాణస్వీకారం చేయగా వారికి అభినందనలు తెలిపారు..
ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు.. ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు
తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు.
నేడు వైయస్సార్ జిల్లాగా చలామణిలో ఉన్న కడప జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా గెజిట్ మార్పులు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. "రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన…