ఇటీవలే యూఏఈ రాజధాని అబుదాబీలో డ్రోన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు. యెమన్‌కు చెందిన హుతీ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడింది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల రోజులపాటు డ్రోన్‌లు, లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. డ్రోన్‌లను ఎరగవేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ఎవరైనా సరే డ్రోన్‌లను ప్రయోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని…
కరోనా ప్రస్తుత పరిస్థితితో మరోసారి ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కూడా తమ రాజధాని నగరం అబుదాబిలోకి ప్రవేశించాలంటే కొన్ని ఆంక్షలను తప్పనిసరి చేసింది. బూస్టర్ డోసు తీసుకున్న వారినే అబుదాబిలోకి అనుమతిస్తామని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకుంటేనే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు పరిగణించనున్నట్టు…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. కొద్దిసేపటి క్రితమే టాస్ వేయగా, కోల్‌కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్నది. ఇప్పటికే ముంబై జట్టు తన మొదటి మ్యాచ్‌లో చైన్నైపై ఓటమి పాలైంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నది. అయితే, కోల్‌కతా జట్టు బెంగళూరుపై అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకొని అదే దూకుడును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాలని…