Chennai Rains Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ధనవంతులు, ఐటీ జాబర్స్ కొందరు కుటుంబాలతో కలిసి విలాసవంతమైన హోటళ్లకు వెళుతున్నారు. చెన్నై నగరంలో గతేడాది డిసెంబరులో భారీ వర్షాలు కురవడంతో…
Holiday declared for schools in Tamil Nadu due to Heavy Rains: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుండి జనవరి 8 ఉదయం 5.30 గంటల వరకు 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరైకల్ (12.2 సెం.మీ.), పుదుచ్చేరి (9.6 సెం.మీ.), కడలూరు…
Chennai Rains Tension to Animal Tamil Version and Naynathara Annapurni Movies: చెన్నై వానలు యానిమల్ మూవీ, నయనతార అన్నపూర్ణిపై పెద్ద ప్రభావాన్ని చూపే ఆవకాశం కనిపిస్తోంది. బుధవారం చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు భారీ వర్షంతో అతలాకుతలం అయ్యాయి. సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి చెన్నై, కాంచీపురం మరియు తిరువళ్లూరులోని చాలా వీధులు దాదాపు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న…
మిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై నగరం నిండుకుండలా మారింది. చెన్నై, కడలూరు, కాంచీపురం, మధురై, కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే భయం భయంగా వుంది. బయటకు రాలేక, జీవనం గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాల కారణంగా చివరి మజిలీకి తిప్పలు తప్పడంలేదు. చెన్నై లో చనిపోయిన వ్యక్తిని ట్రాక్టరు ద్వారా తీసుకెళుతున్నారు కుటుంబ సభ్యులు. సౌత్ చెన్నైలో చోటు చేసుకున్న ఘటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ వర్షాల కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో మరణించిన…
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు.. కాగా,…
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆ సమీక్షలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ… మూడు రోజులపాటు చెన్నైకి ఎవరూ రావొద్దు అని కోరారు. చెన్నై నుంచి ఎవరూ వెళ్లొద్దు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అని సూచించారు. ఇక చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సీఎం సెలవుల్లో ఉన్న…
వర్షాలు, వరదలతో చెన్నై ప్రజలు అల్లాడిపోతున్నారు. నేనున్నాను.. మీకేం కాదంటూ సీఎం స్టాలిన్ అభయం ఇస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని పలకరిస్తూనే వరద నీటిలోనే ఆయన ముందుకుసాగుతున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నై వణుకుతోంది. చెన్నై వాసులు భయం భయంగా గడుపుతున్నారు. వరద ముంపు భయం చెన్నై వాసుల్ని వెంటాడుతూనే వుంది. పదిరోజులు తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి, కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత అనుభవాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాలతో పుయల్, చంబారపాకం డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. సామర్ధ్యానికి మించి నీటిని నిల్వచేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు…