AP Deputy CM Pawan: ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసే కుట్ర జరిగింది అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. వైసీపీ నేతలపై కేసులు అన్ని ఆధారాలతోనే పెడుతున్నాం.. లెక్క పత్రాలతోనే అన్ని జరుగుతున్నాయి.. లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ పై ఇప్పటికిప్పుడు ఏం మాట్లాడలేను.. అది ఎలా పడితే అలా మాట్లాడే విషయం కాదు.. ఆధారాలు లేకుండా ఎవరిపైనా కేసులు పెట్టడం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ తిరిగి గెలిస్తే ఏం చేస్తాడు? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఇక, నరికేస్తాం చంపేస్తాం అనేవి మధ్య యుగం నాటి మాటలు.. ఇప్పుడు అలా మాట్లాడితే శిక్షిస్తామన్నారు. అలాగే, నేనేం రెచ్చగొట్టేలా మాట్లాడటం లేదు కానీ.. నరికేస్తాం… చంపేస్తాం అనడం కరెక్టా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఇక, డిప్యూటీ సీఎంగా నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక్కసారి నా మౌనం రకరకాల ఆలోచనలకు దారి తీస్తోంది అన్నారు. ఏది పడితే అది మాట్లాడ కూడదనే సైలెంట్ అవుతాను.. లిక్కర్ కుంభకోణం ఫ్యాబ్రికేట్ చేసింది కాదు.. మద్యపాన నిషేదం చేస్తామని.. ఏకపక్షంగా వ్యాపారం చేశారు అని ఆరోపించారు. ఇష్టం వచ్చిన కంపెనీలకు, అదీ కల్తీ మద్యం అమ్మారు అని పేర్కొన్నారు. కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు.. ఎంతో మంది నరాల వ్యాధితో బాధపడుతున్నారో తెలుసా.. ఇవన్నీ సాక్షాధారాలు ఉన్నవే.. ఫ్యాబ్రికేట్ చేసిన కేస్ కాదన్నారు. వేల కోట్ల కుంభకోణం జరిగింది.. ఇది ఏ స్థాయి వరకు వెళ్తుందో నాకు తెలియదు.. లిక్కర్ కేసులో జగన్ అరెస్టుకు కేంద్రం అనుమతి కావాలన్న దానిపై నేను చెప్పలేను.. లిక్కర్ స్కాంపై విచారణ అనేది కేబినెట్ నిర్ణయమని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.