Pawan Kalyan: వైస్ జగన్ తో పాటు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే వైసీపీ నేతలను బరిలోకి దిగి చూపించమను అని జగన్ కు సవాల్ విసిరారు.
ల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోయారు.. ఎంతో మంది నరాల వ్యాధితో బాధపడుతున్నారో తెలుసా.. ఇవన్నీ సాక్షాధారాలు ఉన్నవే.. ఫ్యాబ్రికేట్ చేసిన కేస్ కాదన్నారు. వేల కోట్ల కుంభకోణం జరిగింది.. ఇది ఏ స్థాయి వరకు వెళ్తుందో నాకు తెలియదు.. లిక్కర్ కేసులో జగన్ అరెస్టుకు కేంద్రం అనుమతి కావాలన్న దానిపై నేను చెప్పలేను.. లిక్కర్ స్కాంపై విచారణ అనేది కేబినెట్ నిర్ణయమని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన జగన్ లిక్కర్ స్కామ్ లో పలువురు వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను పరిశీలిద్దాం..