రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. మృగశిర కార్తె ప్రారంభం అయి చాలా రోజులు అవుతున్నా సరిగా వానలు పడలేదు. మృగశిర కార్తె వల్ల ముసురు పడుతుంది. వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పినా.. గత కొద్దిరోజులుగా ఎండ వేడితో ఇబ్బందులు పడ్డ బెజవాడ వాసుల్ని వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. వాన కురిపించాడు. భారీవర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానజల్లులు కురిశాయి.రహదారులపైకి చేరిన వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయి డ్రైనేజీలు. గత కొన్ని వారాలుగా ఎండలతో అల్లాడిపోయిన విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు గంటసేపు ఏకధాటిగా వర్షం కురవడంతో నగరం చల్లబడింది.
భారీవర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, రాణిగారితోట, ఎంజీ రోడ్, కృష్ణలంక, ఏలూరు రోడ్, మొగల్రాజపురంలో వాన పడింది. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. వీధులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. వాతావరణం చల్లబడటంతో హమ్మయ్యా అంటూ జనం రిలీఫ్ ఫీలవుతున్నారు. మరో రెండు మూడు రోజులు ఇలానే వర్షం కురవాలని జనం కోరుతున్నారు. రుతుపవనాల ప్రభావం రెండు మూడురోజులు ఇలాగే వుంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Agnipath: సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు.. అల్లర్లకు పాల్పడిన వారిని చేర్చుకోం