Harirama Jogaiah: ఇలా చేస్తే ఐదేళ్లు పవన్ కల్యాణే సీఎంగా ఉంటారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. ఓ వైపు ఎన్నికల పొత్తులు, మరో వైపు లాభాలు, నష్టాలపై నేతలు ఫోకస్ పెట్టారు.. వైసీపీ సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లడం ఫైనల్.. కానీ, మిగతా పార్టీల సంగతి ఇంకా తెలాల్సి ఉంది.. జనసేన-బీజేపీ కలిసి ఉంటాయా? లేక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? దీనిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. అయితే, మాజీ మంత్రి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అన్ని విషయాలు బాసటగా నిలుస్తూ వస్తున్న ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో జనసేన పోటీ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.. గతం కంటే జనసేన బలం ఇప్పుడు పెరిగిందన్న ఆయన.. మూడు పార్టీలు (వైసీపీ, టీడీపీ, జనసేన) విడివిడిగా పోటీ చేస్తే.. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ఆయన.. సీఎం కావడమే కాదు.. ఐదేళ్లు పవనే సీఎంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.
Read Also: KTR: దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
Also Read
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
ఇక, పవన్ కల్యాణ్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటే బీజేపీని కలుపుకొని వెళ్లడం మంచిదన్నారు హరిరామ జోగయ్య.. బీజేపీతో కలిసివెళ్లడం వల్ల జనసేన పార్టీకి లాభమే తప్ప.. నష్టం ఏమీలేదన్నారు.. మరోవైపు.. జనసేన- టీడీపీ కలసి పోటీ చేస్తే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం మరింత సులువు అవుతుందన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా.. పవన్ కల్యాణ్‌కు కలసి వస్తుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. కాపులంతా అన్ని వర్గాలను కలుపుకొని పవన్ కల్యాణ్ కు 100శాతం సహకరించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.
తాజావార్తలు
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!