నేటి నుంచి ఈ నెల 19 వరకు 2000 మంది కి పైగా హజ్ యాత్రకు వెళ్ళనున్నారు ముస్లిం భక్తులు. ఈ దఫా హజ్ యాత్ర కు వెళ్ళే ప్రయాణికులు మొత్తం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణం చేసేలా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఈ నేపథ్యంలో హజ్ యాత్రకు భారీగా తరలివెళ్తున్నారు ముస్లింలు భక్తులు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది ఏస్ జి 5007 విమానం.. 170 మంది ప్రయాణికులతో నేరుగా జెడ్డాకు విమానం చేరుకోనుంది. 41 రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న తిరిగి ఏపీకి రానున్నారు హజీలు.
Also Read : KTR: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..
విజయవాడలోనే ఎంబారికేషన్ పాయింట్ కు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వం… అన్ని జిల్లాల నుంచి యాత్రికులను విజయవాడ తీసుకొచ్చేందుకు వాల్వో బస్సులు ఏర్పాటు చేసింది. హజ్ యాత్రికులపై అదనపు భారం పడకుండా అదుకుని అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి హజీలు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,813 మందిపై తలో రూ.83 వేల అదనపు భారం పడనుంది. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. హజీలకు రూ.14.51 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్రప్రభుత్వం బస, భోజనం, రవాణా సదుపాయాలు కల్పించడం పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?