విజయవాడ లో ప్రజాగ్రహ సభ చాలా పెద్ద సక్సెస్ అయిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ ..వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే లెక్కలేని తనంగా ఉన్న పార్టీలకు నిన్నటి సభ ఒక మేల్కొలుపు లాంటిదని, వైసీపీ పతనంప్రారంభమయిందన్నారు. ఆయా పార్టీ లకు ఓ రకంగా భయం కలిగేలా సభ జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో తేటతెల్లమైందన్నారు. టీడీపి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ—రెండు పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తెలిపారు.
Read Also: ప్రభుత్వ పథకాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ స్వార్థం దాగి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి….మీ పరిస్థితి గల్లంతు అని అర్థం చేసుకోండంటూ ఎద్దేవా చేశారు. అవినీతి ఎత్తి చూపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. అవినీతి తోలుతిసే పార్టీ ఒక్క బీజేపీనేని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లే కార్యక్రమం విరమించుకోకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. బీజేపీ మీ ఆటలను, కుట్రలను కట్టిస్తుందన్నారు. మేము తగ్గేదే లేదు…2024 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమంటూ కీలక జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు.