Crime News: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. కార్తిక్ అనే బాలుడిని మారు తల్లి లక్ష్మీ గోడకేసి కొట్టి చంపేసింది. అలాగే, మరో బాలుడిని అట్ల పెనంతో వాతలు పెట్టింది.. తీవ్ర గాయాలు కావడంతో బాలుడు కేకలు వేయగా.. పోలీసులకు సమాచారం అందజేశారు స్థానికులు. అయితే, భార్య చనిపోవడంతో లక్ష్మీతో సాగన్ సహజీవనం చేస్తున్నాడు.
Read Also: Bandi Sanjay: 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ‘పింక్ వైరస్’.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు ‘కరప్షన్ వైరస్’!
ఇక, మరణించిన బాలుడు కార్తిక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుంటూరులోని జీజీహెచ్ కు తరలించారు. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని పట్టుకుని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.