Ambati Rambabu: ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు బయటకు రాకుండా చేస్తున్నారు..!
- ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు బయటకు రాకుండా చేస్తున్నారు..
- మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కేసు విచిత్రమైనది..
- ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు..
Ambati Rambabu: ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కేసు విచిత్రమైనది.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో కేసు నమోదు చేయలేదట.. మళ్లీ జనవరిలో మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. చాలాకాలంగా రాజకీయాలలో ఉన్నారు.. కాకాణిని కసబ్ ను, టెర్రరిస్టును తీసుకు వచ్చినట్లుగా తీసుకొచ్చారని మండిపడ్డారు.. కాకాణి కారు చుట్టూ పోలీసులు కాపలాగా ఉన్నారు. డీఎస్పీ కోర్టులోకి అడ్వకేట్ల కూడా వెళ్లనివ్వలేదు. ఇలాంటి నిర్బంధాలకు పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణం అని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సోమిరెడ్డి కేసు పెట్టించాడు. కాకాణిని ఇబ్బంది పెట్టాలన్నదే ప్రధాన ఉద్దేశం అని విమర్శించారు అంబటి..
Also Read
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
- Vegetable Market: మరోసారి తెరపైకి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం
ఇక, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.. యాంకర్ గా ఉన్న కొమ్మినేని వారించలేదని కేసు పెట్టారు.. చట్టాలు దుర్వినియోగం చేస్తున్నారు.. ఇది చాలా దుర్మార్గమైనదని దుయ్యబట్టారు అంబటి రాంబాబు.. ఎవరిని అరెస్ట్ చేసినా రెండు నెలలు బయటకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. డెడ్ బాడీ దొరికితే 307 కేసులు కూడా పెడతారు.. అధికారం ఉంటే తప్పుడు కేసులు పెడతారా..? అని నిలదీశారు.. పోలీసులు కూడా ఏ సెక్షన్లు కావాలంటే ఆ సెక్షన్లు పెడుతున్నారు.. పైన ఖాకీచొక్కా… లోపల పచ్చ చొక్కా వేసుకునేవారికే పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు..
తాజావార్తలు
-
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం
-
Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…
-
US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
-
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!