China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
- చైనా రహస్య అంతరిక్ష విమానం ఫోటో విడుదల..
- అమెరికా డిఫెన్స్ నివేదికలో దీని ఫోటో..
- నాలుగో మిషన్ కోసం అంతరిక్షంలో ఉన్న విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Space Plane: చైనా అత్యంత రహస్యమైన అంతరిక్ష విమానం ‘‘షెన్లాంగ్’’(Shenlong)కు చెందిన ఒక ఫోటో సంచలనంగా మారింది. అమెరికా నిఘా సంస్థ విడుదల చేసని రక్షణ ముప్పు అంచనా నివేదికలో దీని గురించి ఉంది. భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న ఈ రోబోటిక్ అంతరిక్ష విమానం గతంలో అంతరిక్షంలో గుర్తుతెలియని వస్తువును విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. గత ఆరేళ్లుగా ఇది అంతరిక్షంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. లో ఎర్త్ ఆర్బిట్(LEO)లో గుర్తుతెలియని వస్తువులను విడుదల చేసినట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి. దీనిపై వార్తలు రావడంతో పలు సంస్థలు, వ్యక్తులు భూమిపై ఉన్న రాడార్లు, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో దీనిని ట్రాక్ చేస్తున్నారు.
తాజాగా వెలువడిన ఫోటోలను 2024లో మ్యాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ తీసింది. సుమారు 90 కిలోమీటర్ల దూరం నుంచి దీనిని ఫోటో తీసింది. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) రూపొందించిన థ్రెట్ అసెస్మెంట్ నివేదికలో ఈ చిత్రం ఉంది. అంతరిక్షంలోకి వెళ్లిన వస్తువుల్ని కక్ష్యలో ప్రవేశపెట్టడం, వాటిపై ప్రయోగాలు నిర్వహించడం, తిరిగి భూమిని చేరుకునే సామర్థ్యాలు ఈ అంతరిక్ష విమానానికి ఉన్నాయని నివేదిక పేర్కొంది.
Also Read
అంతరిక్షంలో మరో ఉపగ్రహానికి ఈ విమానం అనుసంధానమై ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. దీని సోలార్ ప్యానెల్స్ విస్తరించి ఉన్నాయి. విమానం వెనక భాగంలో పేలోడ్ తలుపు కూడా తెరిచి ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. షెన్లాంగ్ రపునర్వినియోగించగల అంతరిక్ష విమానం. ఇది అమెరికాకు చెందిన బోయింగ్ నిర్మిత X-37B అంతరిక్ష విమానాన్ని పోలి ఉంటుంది. రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపిన తర్వాత కక్ష్యలోకి చేరుకుని విమానంలా మళ్లీ భూమిపై ల్యాండ్ అవుతుంది.
ప్రస్తుతం ఇది నాలుగో మిషన్ కోసం అంతరిక్షంలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ -2 ఎఫ్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. షెన్లాంగ్కు సంబంధించి ఇప్పటి వరకు చైనా ఎలాంటి ఫోటో విడుదల చేయలేదు. అయితే, ప్రస్తుతం ఫోటోను బట్టి ఈ అంతరిక్ష విమానం పొడవు సుమారు 26 అడుగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
-
Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!