Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరుస్తూ క్యాడర్ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరికొందరిని బైండోవర్ చేసేందుకు పోలీసులు పిలుస్తున్నారని, ఈ చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలవడం, సంతకాల పేరుతో వారిని తీసుకెళ్లడాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టారు. రౌడీషీట్లు తెరవడం లేదా బైండోవర్ చర్యలు చేపట్టడం జరిగితే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, కార్పొరేషన్, జిల్లా పరిషత్ (జెడ్పీ) ఎన్నికల్లో రెండు పదవులు మహిళలకు రిజర్వ్ అయ్యాయని అంబటి రాంబాబు పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తామని వెల్లడించారు. పార్టీ క్యాడర్ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు..
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
తాజావార్తలు
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..