ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కేసు విచిత్రమైనది.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో కేసు నమోదు చేయలేదట.. మళ్లీ జనవరిలో మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు.