CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమం, అభివృద్ధి, బీసీ రిజర్వేషన్లు, పోలవరం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీ బీసీలకు అండగా ఉందని అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తామే అమలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్లీ 34 శాతానికి పెంచామని తెలిపారు. అయితే 34 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ప్రతిపక్షం కోర్టుకు వెళ్లి అడ్డుకుందని అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు.
బీసీ వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వారు డీఎస్సీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 300 కేసులు వేశారని ఆరోపించారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదల సమస్యలను పరిష్కరిస్తూ సుపరిపాలనతో పునర్నిర్మాణం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గత పాలకులు ఇష్టానుసారంగా అప్పులు చేశారని, ప్రస్తుతం ఒక్కో సమస్యను సరిచేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..
Also Read
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
తాజావార్తలు
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!