Ambati Rambabu: ఎవరిని అరెస్టు చేసినా.. 2 నెలలు జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కేసు విచిత్రమైనది.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. గతంలో కేసు నమోదు చేయలేదట.. మళ్లీ జనవరిలో మంగళగిరి సీఐడీకి ఫిర్యాదు చేశారు. చాలాకాలంగా రాజకీయాలలో ఉన్నారు.. కాకాణిని కసబ్ ను, టెర్రరిస్టును తీసుకు వచ్చినట్లుగా తీసుకొచ్చారని మండిపడ్డారు.. కాకాణి కారు చుట్టూ పోలీసులు కాపలాగా ఉన్నారు. డీఎస్పీ కోర్టులోకి అడ్వకేట్ల కూడా వెళ్లనివ్వలేదు. ఇలాంటి నిర్బంధాలకు పైనుంచి వచ్చిన ఆదేశాలే కారణం అని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే సోమిరెడ్డి కేసు పెట్టించాడు. కాకాణిని ఇబ్బంది పెట్టాలన్నదే ప్రధాన ఉద్దేశం అని విమర్శించారు అంబటి..
ఇక, కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.. యాంకర్ గా ఉన్న కొమ్మినేని వారించలేదని కేసు పెట్టారు.. చట్టాలు దుర్వినియోగం చేస్తున్నారు.. ఇది చాలా దుర్మార్గమైనదని దుయ్యబట్టారు అంబటి రాంబాబు.. ఎవరిని అరెస్ట్ చేసినా రెండు నెలలు బయటకు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. డెడ్ బాడీ దొరికితే 307 కేసులు కూడా పెడతారు.. అధికారం ఉంటే తప్పుడు కేసులు పెడతారా..? అని నిలదీశారు.. పోలీసులు కూడా ఏ సెక్షన్లు కావాలంటే ఆ సెక్షన్లు పెడుతున్నారు.. పైన ఖాకీచొక్కా… లోపల పచ్చ చొక్కా వేసుకునేవారికే పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు..